రామగిరిఖిల్లాపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి

రామగిరిఖిల్లాపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి

*రామగిరిఖిల్లాపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి*

-చారిత్రాత్మక స్థలాలకు ఆదరణ కరువు
-పెద్ద మంత్రి ఉన్నా..ఫలితం సున్నా
-ప్రజల అభ్యర్తనలపై చిత్తశుద్ధి ఏది..?
-పర్యాటకానికి రూ.2వందల కోట్లు కేటాయించిన కేంద్రం

-బీజేపీ రాష్ట్రనేత సురేష్ రెడ్డి

పెద్దపల్లి,20:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
రామగిరిఖిలా అభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో అదే సభలో పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా అభివృద్ది కొరకు విస్పష్ట ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేసారు.ఈ మేరకు సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేసారు.ఆ ప్రకటనలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ స్వయాన శ్రీరామచంద్రుడు సీతాసమేతంగా ఇక్కడ నడయాడిన ఆనవాళ్ళు ఉన్నాయని,రాములవారు స్వయంభుగా ఇక్కడ వెలిశారనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రపంచ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యచకితులను చేసే వనమూలికలు ఈఖిల్లా సొంతమన్న ఆయన, పేరొందిన సైంటిస్టులు ఇక్కడికి వచ్చి వనమూలిక సేకరణ జరుపుతున్నారన్నారు.

*ప్రజల అభ్యర్తనలపై చిత్తశుద్ధి ఏది..?*
ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలనీ ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా చిత్తశుద్ధి లేని కారణంగా తాము చేసిన అభ్యర్తనలను పట్టించుకున్న పాపాన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని,జిల్లాకు ఒక పెద్దమంత్రి నేత్రుత్వం వహిస్తున్నా ఫలితం మాత్రం శూన్యమని మండిపడ్డారు. పర్యాటక కేంద్రాలపట్ల కాంగ్రేస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని,ఆధ్యాత్మిక స్థలాలు అభివృద్ధి చెందడం వారికి ఇష్టంలేదని విమర్శించారు.రామగిరి ఖిల్లా అభివృద్ది జరిగితే స్థానిక యువతకు ఉపాధి మార్గాలు కల్పించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమాకూరుతుందని,జిల్లాపేరు దేశ విదేశాలకు విస్తరిస్తుందని తెలిపారు.

*పర్యాటకానికి కేంద్రం రూ.2వందలకోట్లు*
రామగిరిఖిల్లా అనగానే శ్రావణమాసం గుర్తుకువస్తుందన్న సురేష్ రెడ్డి, ఆ కాలంలో పర్యాటకులతో ఖిల్లా సందడిగా ఉంటుందన్నారు.ప్రస్తుతం రామగిరిఖిలా రాష్ట్రపరిధిలోని అంశమని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించి పర్యాటక శోభను పెంచాలన్నారు.లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేలా లేఖ ఇస్తే, అక్కడి నుండే నిధులు తెప్పించి రామగిరికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.స్వదేశ్ దర్శన్,ప్రసాద్,భారత్ గౌరవ్ పేరుతో ఆలయాలు,పర్యాటక అభివృద్ది కొరకు రూ.2వందల కోట్లను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు కేటాయించిందని సురేష్ రెడ్డి తెలిపారు.రామగిరిఖిలా అభివృద్ది చెందితే జిల్లాకు అంతర్జాతీయంగా మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )