మెట్ పల్లిలో గంజాయి ముఠా గుట్టురట్టు

మెట్ పల్లిలో గంజాయి ముఠా గుట్టురట్టు

మెట్ పల్లిలో గంజాయి ముఠా గుట్టురట్టు
ఇద్దరు యువకుల అరెస్ట్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఏప్రిల్ 19 (ప్రజాకలం)

యువత నరాల్లో విషం నింపుతున్న గంజాయి ముఠా ఆట కట్టించారు మెట్ పల్లి పోలీసులు. వైఎస్సార్ అర్బన్ కాలనీని అడ్డాగా చేసుకుని సాగిస్తున్న ఈ దందాపై ఎస్ఐ కిరణ్ కుమార్ తన బృందంతో కలిసి మెరుపు దాడి చేశారు.
మెట్ పల్లి పట్టణంలోని వైయస్సార్ అర్బన్ కాలనీలో గత కొంత కాలంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్ పల్లికి చెందిన మల్యాల చందు, కోరుట్ల మండలం మోహన్ రావు పేటకు చెందిన బాణాల రాజు గత కొంతకాలంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి మెట్ పల్లి పట్టణంలోని యువతకు, విద్యార్థులకు భారీ ధరకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి 140 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మెట్ పల్లి ఎస్ఐ పి. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో వైయస్సార్ అర్బన్ కాలనీలోని అనుమానిత నిందితుల స్థావరంపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు మెదక్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అంతేకాక, వీరిద్దరిపై గతంలో కూడా గంజాయి కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఈ ఘటనపై నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా గంజాయి కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం లేదా వినియోగించడం చట్టరీత్యా శిక్షార్హం అని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ముఖ్యంగా యువత గంజాయికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )