నాబార్డ్ నుంచి ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్ర స్థాయి అత్యున్నత గుర్తింపు

నాబార్డ్ నుంచి ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్ర స్థాయి అత్యున్నత గుర్తింపు

నాబార్డ్ నుంచి ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్ర స్థాయి అత్యున్నత గుర్తింపు

2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఉత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుగా ఖమ్మం బ్యాంకు ఎంపిక.

 

ఖమ్మం, జూలై 17( ప్రజా కలం న్యూస్)

 

 

 

2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఉత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుగా ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఎంపికైనట్లు బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (బాధ్యతలు నిర్వహిస్తున్న) ఎన్. వెంకట ఆదిత్య తెలిపారు.

ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, శాఖల నిర్వాహకులు, అనుబంధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఖాతాదారులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

గత 105 ఏళ్లుగా ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అందిస్తున్న సేవలు, 2025–26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన విశిష్ట ప్రగతి కారణంగానే ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం బ్యాంకు కుటుంబం మొత్తం సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు.

ఉద్యోగుల అంకితభావం, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం, సీనియర్ అధికారుల మార్గదర్శకత్వం, శాఖల నిర్వాహకుల సమర్థ నిర్వహణ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. అలాగే పాలక మండలి దూరదృష్టి, విధానపరమైన సహకారం బ్యాంకు అభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు.

బ్యాంకుపై విశ్వాసం ఉంచిన ఖాతాదారులు, అనుబంధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారమే బ్యాంకు అభివృద్ధికి బలమైందని అన్నారు.

ఈ పురస్కారం గత విజయాలకు గుర్తింపు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుందని ఎన్. వెంకట ఆదిత్య పేర్కొన్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలోనే అత్యంత విశ్వసనీయమైన, అతిపెద్ద సహకార బ్యాంకుగా ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మరింత అభివృద్ధి చేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )