నాబార్డ్ నుండి 6 విభాగాలలో ఉత్తమ అవార్డ్ లు అందుకున్న హనుమకొండ&ములుగు జిల్లాలు 

నాబార్డ్ నుండి 6 విభాగాలలో ఉత్తమ అవార్డ్ లు అందుకున్న హనుమకొండ&ములుగు జిల్లాలు 


నాబార్డ్ నుండి 6 విభాగాలలో ఉత్తమ అవార్డ్ లు అందుకున్న హనుమకొండ&ములుగు జిల్లాలు

 

హనుమకొండ జులై 17 ప్రజా కలం ప్రతినిధి

 

 

2025–2026 వార్షిక సంవత్సరానికి వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో 6 విభాగాలలో ఉత్తమ అవార్డ్ లను హనుమకొండ,ములుగు జిల్లాలు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన. కిషోర్ చేతుల మీదుగా 45 వ నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సం సందర్బంగా అందుకోవడం జరిగింది.ఉత్తమ ప్రాధమిక వ్యవసాయ సహకారం – నందనం పరస్పర సహాయక సహకార సంఘం హనుమకొండ జిల్లా రైతులకు రుణాల పంపినీ,డ్రోన్ల వినియోగం,వ్యవసాయ రంగం లో కొత్త ఆవిస్కరణలను రైతులకు అందించడం,ఉత్తమ గిరిజనాభివృద్ధి పధకం-ములుగు జిల్లాలోని తాడ్వాయి మరియు గోవిందరావుపేట మండలాలో 1000 ఎకరాలలో మామిడి తోటల పెంపకం,జీవనోపాధి కల్పన వనసమాఖ్య సంస్థ ద్వారా అమలుచేయబడిందని ఉత్తమ రైతు ఉత్పత్తి దారుల సంఘం – హనుమకొండ జిల్లా ఎర్రబెల్లి మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘం ఇది 500 మంది మహిళా రైతులతో ఏర్పాటు చేసిన సంఘం ఈ సంఘం ద్వారా రైతులు ఎరువుల వ్యాపారం,కూరగాయల సాగు ,పుట్ట గొడుగుల పెంపకం,ఆయిల్ పామ్,తోటల పెంపకం కార్యక్రమాలను జనవికాస రూరల్ డెవలప్ మెంట్ సంస్థ ద్వారా అమలు చేయడం జరుగుతుంది .

ఉత్తమ చానల్ పార్ట్ నర్ – కార్నెల్ సద్ గురు ఫౌండేషన్ వారు హనుమకొండ జిల్లాలో 10 డ్రోన్ ల వినియోగం,20 పైలేట్ లకు శిక్షణ ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీస్ ను ముందుకు తీసుకెళ్లడం,ఉత్తమ వీడియో విబాగం – ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో సమగ్ర గిరిజనాభివృద్ధి పధకం లో బాగంగా మాతోట కార్యక్రమం లో అంతర పంటగా 150 ఎకరాలలో పుచ్చ తోటల పెంపకం ను గిరిజన రైతుల ద్వారా వనసమాఖ్య అమలు చేస్తున్న పధకం ద్వారా ఉత్తమ జిల్లా అభివృద్ధి మేనేజర్ – నాబార్డ్ DDM లింగంపల్లి చంద్రశేకర్ ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకు వృద్ధి ,FPO బలోపేతం,3500 రైతుల ద్వారా వరిలో తడి,పొడి పద్ధతుల అమలు,సమగ్ర గిరిజనాభివృద్ధి పధకం లో 1500 మంది గిరిజన కుటుంబాలకు చేయూత,వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు అమలు చేయించడం జరిగిందన్నారు.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )