ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు

ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు

ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు

 

*రుద్రంగి, జూలై 08, (ప్రజాకలం ప్రతినిధి)*

 

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మేర సంఘం ఆద్వర్యంలో బుధవారం గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుల్లు బైండ్లోల్ల నృత్యాలతో మహిళలు బోనాలతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు సంవృద్దిగా పండి, గ్రామ ప్రజలని సుఖసంతోషాలతో చల్లగా చూడాలని గ్రామ దేవత పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు మేర కులస్థులు తెలిపారు. ఈ కారక్రమంలో మాజీ జడ్పీటీసి గట్ల మీనయ్య, సంఘ సభ్యులు పెద్ది లక్ష్మీ నర్సయ్య, గట్ల ప్రకాష్, శ్రీనివాస్, రాజు, సాగర్, కోడి గంటి శ్యామ్, పెద్ది రవి, కోడిగంటి ప్రకాష్, ఉమేష్, సుధీర్, మామిడిశెట్టి రామచంద్రం, శ్రావణ్, రాహుల్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )