
ప్రజా కలం” వార్తకు స్పందన..!
“ప్రజా కలం” వార్తకు స్పందన..!
చెత్త కుప్పలు తొలగించిన మున్సిపల్ అధికారులు..!!
కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు

మెట్‌పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 4 (ప్రజా కలం) పట్టణంలోని పలు వార్డుల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై “ప్రజా కలం” దిన పత్రిక లో శుక్రవారం ప్రచురించిన వార్తకు కథనంకు మున్సిపల్ అధికారులు స్పందించారు. వార్త వెలువడిన కొన్ని గంటల్లోనే సంబంధిత ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది చెత్త తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. వెంటనే చెత్త తొలగింపుతో స్థానికుల్లో ఆనందం వెల్లువిరిసింది. ఇకపోతే ఇటు ప్రజల సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రజా కలం దిన పత్రికకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తక్షణ చర్యలు తీసుకున్న మున్సిపల్ అధికారులను కూడా అభినందించారు. ఇకపై కూడా వార్డుల్లో చెత్త సేకరణను క్రమం తప్పకుండా నిర్వహించి, దోమల నివారణ చర్యలు చేపట్టి ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

