నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలే రక్షణ”

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలే రక్షణ”

“నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలే రక్షణ”

 

5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి:

 

2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్

 

గజ్వేల్:27 జూన్ 2026 ( ప్రజా కలం ప్రతినిధి )

 

గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు.2వ వార్డు ప్రజల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ పక్కనున్న గల్లీలోని వినాయక మండపం ఆవరణలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 28 (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.”నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలే రక్షణ” అని ఆమె పేర్కొంటూ, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )