
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
రౌడీ షీటర్లకు కోరుట్ల సీఐ కొమ్ము తిరుపతి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, అక్టోబర్ 16(ప్రజా కలం): దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కొమ్ము తిరుపతి తెలిపారు. సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, పండుగ నేపథ్యంలో కోరుట్ల పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నేర ప్రవర్తనను విడనాడి సాధారణ పౌరులుగా జీవించాలని హితవు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ఘర్షణలకు దిగినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ దసరా పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకునేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్ఐ జి. శ్యామ్రాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

