బతుకమ్మ వేడుకలో కుల వివక్షత

బతుకమ్మ వేడుకలో కుల వివక్షత

బతుకమ్మ వేడుకలో కుల వివక్షత

* దళిత,రెడ్డి సామాజిక వర్గాల మహిళల మధ్య వివాదం..

* ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట దళిత మహిళల ఆందోళన…

* ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్

యాదాద్రి అక్టోబర్ 12 ప్రజాకలం:ఏఐ టెక్నాలజీ కాలంలోనూ కుల వివక్షత జాడ్యం మాత్రం పోవడం లేదు.బతుకమ్మ పండుగ వేళ,రెడ్డి కులస్తులు దళిత మహిళల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం టి. రేపాక గ్రామంలో కుల వివక్షత ఘటన కలకలం రేపింది.మొన్న జరిగిన బతుకమ్మ వేడుకలలో దళిత,రెడ్డి,సామాజిక వర్గానికి చెందిన మహిళల మధ్య వివాదం రాజుకుంది.దళిత మహిళలు ఆడిన దగ్గర,తాము బతుకమ్మ ఆడబోమని రెడ్డి సామాజిక వర్గ మహిళలు అన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.అలాగే వారు తెచ్చిన బతుకమ్మలు అక్కడి నుండి తీసుకెళ్లారు.కులవివక్షతో తమను అవమానించారని, దళిత మహిళలు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.తమను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )