
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
జిల్లా అదనపు కలెక్టర్ బి ఎస్ లత
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజా కలం) పట్టణంలోని సామాజిక ఆసుపత్రిని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతా తెలిపారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లతా సామాజిక వైద్యశాలను సందర్శించి హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిచెన్ రూమ్ సందర్శించి రోజు చేస్తున్న వంటలను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న సామాజిక వైద్యశాలను సందర్శించి పనులు ఎంతవరకు వచ్చినది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎన్ శ్రీనివాస్,డాక్టర్ అమరేశ్వర్, మున్సిపల్ మేనేజర్ వెంకటలక్ష్మి, సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, విష్ణు, ముజీబ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
TAGS Hot News

