సంఘటిత శక్తితోనే రాజకీయ ప్రయోజనాలు

సంఘటిత శక్తితోనే రాజకీయ ప్రయోజనాలు

సంఘటిత శక్తితోనే రాజకీయ ప్రయోజనాలు



-మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్

 

జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవ ఎన్నిక

 

పెద్దపల్లి,జూన్ 14:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)

పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్నికల్లో 23వ వార్డు కౌన్సిలర్ జడల సురేందర్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ,ఎన్నికల నిర్వహణ అధికారి సాదుల వెంకటేశ్వర్ పటేల్ పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసింది.ఫలితాల ప్రకటన అనంతరం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్ నూతన జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన జడల సురేందర్‌కు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ రాణించే సత్తా కలిగిన వారని కొనియాడారు.ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తక్కువగా చూపుతున్నారని,ఇది సామాజిక మరియు రాజకీయ వాటాను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీనిని అధిగమించేందుకు ప్రతి యువకుడు బాధ్యతగా గ్రామాల్లోని ఇంటింటి వివరాలను సేకరించి,సరైన గణాంకాలను ప్రభుత్వానికి అందించాలని పిలుపునిచ్చారు.చట్టసభల్లో మున్నూరు కాపులకు రావాల్సిన సముచిత వాటాను సాధించుకునేందుకు సంఘం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా కేంద్రంలో మున్నూరు కాపుల కోసం ఒక అధునాతన కమ్యూనిటీ హాల్ మరియు పేద విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయడమే తమ తక్షణ లక్ష్యమని,దీని కోసం స్థల సేకరణకు సంబంధించి ప్రభుత్వం మరియు స్థానిక నాయకుల మద్దతును కట్టుకొని నూతన అధ్యక్షుడు ముందుకు సాగాలన్నారు.కుల సంఘం అనేది కేవలం సంఘటితం కావడం మాత్రమే కాదని,అన్ని కుల సంఘాలతో సమన్వయం చేసుకుంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన జడల సురేందర్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని,కుల ఐక్యత కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య,రాష్ట్ర కార్యదర్శి ఇసంపల్లి వెంకన్న పటేల్,మల్క రామస్వామి, ఎలువాక రాజయ్య,అమిరిశెట్టి రామస్వామి,బిరుదు క్రీష్ణ,తూముల శ్రీనివాస్,బండారు రామ్మూర్తి,ఆకుల మహేందర్,గంట రమేష్,వునుకొండ శ్రీధర్, విజయలక్ష్మి, హరి శంకర్, ఆకుల వివేక్ పటేల్, పూదరి మహేందర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కుల బాంధవులు పాల్గొని నూతన అధ్యక్షుని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )