
త్వరలోనే ముత్యం పేట చక్కర ఫ్యాక్టరీని తెరుస్తాం
త్వరలోనే ముత్యం పేట చక్కర ఫ్యాక్టరీని తెరుస్తా.
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజా కలం) సాధ్యమైనంత త్వరగా ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు.మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ ముత్యం పేట చక్కర ఫ్యాక్టరీని పున ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపడుతోందని జీవన్ రెడ్డి తెలిపారు. త్వరితగతిన ఫ్యాక్టరీని పున ప్రారంభిస్తామని తాటిపర్తి జీవన్ రెడ్డి వెల్లడించారు. బకాయి ఉన్న 170 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. చక్కెర ఫ్యాక్టరీల పరిశీలనకు ఈనెల 26న రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రెటరీ, ఉన్నతాధికారులు వస్తున్నారని అన్నారు. చక్కర ఫ్యాక్టరీలను పున ప్రారంభించడానికి రాష్ట్ర కమిటీ నేతృత్వంలో రైతులతో నేరుగా మాట్లాడడానికి రానున్న రోజుల్లో పంటను ఎలా సాగు చేయాలని అనుకూలమయ్యే పరిస్థితులను అధ్యయనం చేయడానికి వారు వస్తున్నారని అన్నారు.దీనికి రైతులంతా సహకరించాలని, ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, అల్లూరు మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి, తుమ్మలపల్లి రాంప్రసాద్, ముఖిమ్, షేక్ మహ్మద్, జాకీర్, కొమ్ముల సంతోష్ రెడ్డి, జీవన్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

