
పేకాట స్థావరంపై దాడి
పేకాట స్థావరంపై దాడి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మే 11 (ప్రజా కలం) కోరుట్లలోని జమ్మి గద్దె సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు స్థావరం పై పోలీసులు దాడి చేశారు ఏ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ 8500 రూపాయల నగదు, ఏడు సెల్ ఫోన్లు, తొమ్మిది మోటార్ సైకిల్ లను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్ ఐ చిరంజీవి తెలిపారు. మరొక ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, పేకాట ఆడుతున్న ఈ పది మంది పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడిలో ఎస్ఐ చిరంజీవి, కోరుట్ల పిఎస్ సిబ్బంది శివాజీ,ఎల్లయ్య, గంగాధర్, రామకోటి ఉన్నారు.
TAGS Hot News

