మీడియాషన్ కేంద్రాల ఏర్పాటు శుభపరిణామం

మీడియాషన్ కేంద్రాల ఏర్పాటు శుభపరిణామం

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 27 (ప్రజా కలం) ప్రజలకు సత్వర న్యాయం జరగాల్సిన సమయంలో మీడియాషన్ కేంద్రాల ఏర్పాటు శుభపరిణామం అని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు అన్నారు. ఇటీవల మెట్ పల్లి కోర్టు నుండి మీడియాషన్ శిక్షణ పూర్తిచేసుకున్న న్యాయవాదులు ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, తునికి వేణు గోపాల్, పసునూరి శ్రీనివాస్ లను ఈ సందర్బంగా ఆయన సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కక్షిదారుల మధ్య రాజీ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావడం అభినందనీయం అన్నారు. మధ్యవర్తిత్వ కేంద్రాలతో కక్షిదారులకు ఉపయోగం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు మార్క వంశీకృష్ణ, ఉడుత ప్రశాంత్ మహర్షి, మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కిషన్ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వాకిడి సత్యం రెడ్డి, ఫిషర్ మెన్ కమిటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రుత్త నారాయణ, మాజీ పట్టణ అధ్యక్షులు కుత్బుద్దీన్, మాజీ ఎంపిటీసి సింగరపు అశోక్, ఫిషర్ మెన్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ కల్లెడ గంగాధర్ లు ఉన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )