పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ అద్దె బస్సు

పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ అద్దె బస్సు

పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ అద్దె బస్సు

జగిత్యాలలో తృటిలో తప్పిన భారీ ప్రమాదం..

భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు

జగిత్యాల ప్రతినిధి 28 (ప్రజాకలం)

జగిత్యాల పట్టణంలోని యవర్ రోడ్డులో సోమవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 20 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు పాఠశాల బస్సు స్వల్పంగా దెబ్బతినగా, అదృష్టవశాత్తూ విద్యార్థులకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన అనంతరం విద్యార్థులు భయాందోళనకు గురికాగా, సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లలను సురక్షితంగా చూసి ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు యవర్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )