
భర్తను చంపించిన భార్య -మద్యం వేధింపులే కారణమా…?
భర్తను చంపించిన భార్య -మద్యం వేధింపులే కారణమా…?
పెద్దపల్లి,జూలై 01:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని హనుమాన్ నగర్‌లో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది.గద్దల శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య పుష్పలత చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు.స్థానికంగా అందుతున్న సమాచారంమేరకు,భార్యాభర్తలైన శ్రీనివాస్,పుష్పలతల మధ్య గత కొంతకాలంగా ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయి.శ్రీనివాస్ ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి తనను తీవ్రంగా హింసించేవాడని, ఆ వేధింపులను భరించలేకే చివరకు ఈ ఘోరానికి ఒడిగట్టాల్సి వచ్చిందని భార్య పుష్పలత ప్రాథమిక విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.ఘటనా స్థలంలో శ్రీనివాస్ రక్తపు మడుగులో పడి ఉండగా,సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి,దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

