మూడు ముక్కలాటకు ముగింపు లేదా..?

మూడు ముక్కలాటకు ముగింపు లేదా..?

– అధికారుల తీరు ఇకనైనా మారదా*…?
– *కుటుంబాలు ఛిద్రమై పోతున్న, పోలీస్ ఉన్నతధికారులు పట్టించుకోరా*…?
– *ప్రశ్నిస్తున్న ఎటపాక మండల ప్రజానీకం*
–పేకాట ముగింపు ఎప్పుడు?
:ప్రజాకలం ప్రతినిధి ఎటపాక, అక్టోబర్ 10:
మూడు ముక్కలాట అనగానే మనకు గుర్తుకు వచ్చేది జూదం పేకాట. పేకాటను సరదా కోసం కొందరు ఆడితే , డబ్బు సంపాదనే ధ్యేయంగా మరికొందరు వ్యసనంగా మార్చుకొని ఆడుతున్నారు. ఆంధ్ర , తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఎటపాక మండలం ఇందుకు అడ్డాగా మారిందని బాహాటంగా చర్చ నడుస్తోంది. మండలంలోని బొజ్జిగుప్ప , తునికిచెరువు అటవీప్రాంతం , చోడవరం , రాయనిపేట , గుండాల మధ్య నది పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని కలుపుకొని పేకాట యధేచ్చగా నడిపిస్తున్నారనే వార్తలు మండలంలో బలంగానే వినబడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఎటపాక మండలంలోని చోడవరం పరిసర ప్రాంతాలను కేంద్ర బిందువుగా చేసుకొని ఆడుతున్న పేకాటలో భద్రాచలం,ఖమ్మం , పాల్వంచ , కొత్తగూడెం , మణుగూరు , జూలూరుపాడు తదితర ప్రాంతాలకు చెందిన జూదరుల వలన లక్షల్లో చేతులు మారుతున్నాయి. ప్రజలు ఈ పేకాటను అలవాటుగా మార్చుకొని తీవ్రంగా నష్టపోతున్నారన్న వాదనలు బలంగావినిపిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర ప్రాంతంలో పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జూదాట వలన చాలా కుటుంబాలు నష్టపోతున్నర lని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఇలా కొనసాగితే చాలా కుటుంబాలు రోడ్ల పాలయ్యేట్టుగా ఉన్నాయన్న ఆలోచనలు చాలా మందిలో రగిలిస్తున్నాయి.ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి పేకాట స్థావరాలపై నిఘా పెడితే కచ్చితంగా కట్టడి చేసే అవకాశం ఉందని పలువురు ముక్తకంఠంతో కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )