
పోలీస్ అమరవీరులకు ఘన నివాళి
పోలీస్ అమరవీరులకు ఘన నివాళి
…. కొవ్వొత్తుల ర్యాలీ.
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి అక్టోబర్ 23 (ప్రజా కలం) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు.డీఎస్పీ అడ్లూరి రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ ల ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి, పాదా బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి. పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, పొలిటికల్ లీడర్స్, యువత పాల్గొన్నారు.

TAGS Hot News

