గంజాయి విక్రయించిన.. సేవించిన పీడీ యాక్ట్

గంజాయి విక్రయించిన.. సేవించిన పీడీ యాక్ట్

గంజాయి విక్రయించిన.. సేవించిన పీడీ యాక్ట్
కోరుట్ల సీఐ సురేష్ బాబు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 12 (ప్రజా కలం) కోరుట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి గంజాయి విక్రయిస్తున్నట్లు నిర్ధారించి స్టేషన్ కు తరలించినట్లు కోరుట్ల సిఐ సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ సీసీఎస్ సిఐ ఎం శ్రీనివాస్ వారి సిబ్బంది, కోరుట్ల ఎస్సై ఎం, చిరంజీవి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 210 గ్రాముల గంజాయిని, రెండు సెల్ ఫోన్ లను కూడా స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయిని ఎవరు సేవించిన, విక్రయించిన, రవాణా చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సిఐ తెలిపారు. ఈ కేసులో కోరుట్ల కు చెందిన కార్ మెకానిక్ షేక్ అమన్@ ఫైజు రజా, డిగ్రీ స్టూడెంట్ ముఖీం @ ముక్తర్ లను అరెస్ట్ చేయగా, మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )