
నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి.
డిఎస్పీ ఆఫీసును సందర్శించి ఎస్పి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 14 (ప్రజా కలం)

నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అఫీసర్లు కు సూచించారు. శుక్రవారంనాడు వార్షిక తనిఖీల్లో భాగంగా మెట్ పల్లి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేశారు. డిఎస్పి కార్యాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం రికార్డు, రిజిస్టర్ లను పరిశీలించారు. సబ్ డివిజన్ పరిదిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసులలో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్, ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, పరిశీలించారు.ఎస్ ఓ పి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని,5s ఇంప్లిమెంటేషన్ చేయాలని సూచించారు. సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా సి.ఐలు, ఎస్సై ల ద్వారా చర్యలు తీసుకోవాలని రాములు సూచించారు. తరచుగా సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సూచించారు. సబ్ డివిజన్ పరిదిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గంజాయి రవాణా, విక్రయ చేసే వారిపై నిగా ఏర్పాటు చేసి తరచూ తనిఖీలు నిర్వహించి గంజాయి ని సమూలంగా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.కమ్యూనిటీ పొలిసింగ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్ నేరాలు వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని అన్నారు.
అదేవిధంగా సిసి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో తెలియజేస్తూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డిఎస్పీ రాములు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సి.ఐ లు అనిల్ కుమార్,సురేష్ బాబు, ఎస్సై లు కిరణ్ కుమార్, అనిల్, రాజు, చిరంజీవి, శ్రీధర్ రెడ్డి,నవీన్, రామచంద్రం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు




