ముదిమాణిక్యం లో మెడికవర్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం

ముదిమాణిక్యం లో మెడికవర్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం

ముదిమాణిక్యం లో మెడికవర్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం

చిగురుమామిడి, ఏప్రిల్ 07 ప్రజాకలం: మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో మంగళవారం రోజున కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య‌ శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 200 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు డాక్టర్, నాగరాజు జనరల్ ఫిజీషియన్,డిఎమ్ఓ సుస్మిత తెలిపారు.వీరికి అవసరమైన వారికి షుగర్, బీపీ,ఈసీజీ,కీళ్ల నొప్పులకు సంబంధించిన పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కర్ణాకర్,రఘు, మాట్లాడుతూ ముదిమాణిక్యం గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో పండుగలు. సెలవులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో గ్రామ సర్పంచ్ బోయిని రమేష్, ఉప సర్పంచ్ పూదరి పర్షరాములు,వార్డు సభ్యులు పచ్చిమట్ల జగన్, పోతరాజు మునిందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంజ ప్రకాష్ గౌడ్, గ్రామ ప్రజలు అంజిరెడ్డి,రాజిరెడ్డి. రాములు, మాధవరెడ్డి, మధుసూదన్, రాజు, శంకరయ్య,తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )