రోడ్డెక్కిన మొక్క జొన్న రైతులు..

రోడ్డెక్కిన మొక్క జొన్న రైతులు..

రోడ్డెక్కిన మొక్క జొన్న రైతులు..
మల్లాపూర్ నవంబర్ 20 ( ప్రజా కలం ప్రతినిధి)
ఆరుగాలం శ్రమించి పండించిన తమ మొక్క జొన్న పంటకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మల్లాపూర్ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.
రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపించారు. మార్కెట్ ప్రారంభమై నెల రోజులైనా సమస్యలు పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే పంటల్ని తీసుకువచ్చి తేమ శాతం వచ్చి తూకం వేసే సమయానికి తాజాగా డీఎం వచ్చి “మక్కలను చెన పట్టి, ఏలాంటి తుక్కు లేకపోతే నే
కొనుగోలు చేయడం జరుగుతుంది అని లేకపోతే కొనుగోలు సాధ్యంకాదు” అని మొక్క జొన్న తుకలను నిలిపివేయడం రైతులకు మరో సమస్యగా మారింది. అకస్మాత్తుగా కొత్త షరతులు విధించడం అన్యాయం అని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను పరిష్కరించి,ఎలాంటి షరతు లు లేకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియను సాఫీగా కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )