
పేకాట స్థావరం పై పోలీసుల దాడి…
పేకాట స్థావరం పై పోలీసుల దాడి…
.. నగదు, నాలుగు సెల్ ఫోన్ల స్వాధీనం..
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 23 (ప్రజా కలం) పేకాట స్థావరాలపై జగిత్యాల సీసీఎస్, కోరుట్ల పోలీసులు దాడుల నిర్వహించి నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం. కోరుట్ల మండలంలోని మాదాపూర్ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి. పేకాట ఆడుతున్న కోరుట్ల కు చెందిన పేరాల శరత్ బాబు, అబ్దుల్ రెహమాన్, సిరికొండకు చెందిన నాంపల్లి శ్రీధర్, కోరుట్ల కు చెందిన గాంధారి శ్రీనివాస్ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 98 వేల రెండు వందల రూపాయలు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
TAGS Hot News

