ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడిగితే నిలదీయండి

ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడిగితే నిలదీయండి

ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడిగితే నిలదీయండి
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 22 (ప్రజా కలం) ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల నుండి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టి కి వచ్చిందని, ఎవరైనా డబ్బులు అడుగుతే నిలదీయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సూచించారు.శనివారం మెట్ పల్లి లోని ఎంపీడీఓ కార్యాలయంలో మెట్ పల్లి పట్టణ, మెట్ పల్లి మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే సంజయ్ లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని వరుస ఫిర్యాదులు వస్తున్నాయని, నాయకులైన, అధికారులైన, సిబ్బందైన వారు ఎవరైనా కూడా డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండన్నారు. నేనే జైలుకు వేలుతానని ఎమ్మెల్యే అన్నారు.డబ్బులు అడిగితే నేరుగా కాల్ చేయాలని సంజయ్ సూచించారు. నిరుపేదల సొంతింటి కల సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి పథకాల్లో దళారులు డబ్బులు అడగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఇందిరమ్మ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )