స్వేచ్ఛాయుత ఎన్నికల కోసమే ఫ్లాగ్ మార్చ్

స్వేచ్ఛాయుత ఎన్నికల కోసమే ఫ్లాగ్ మార్చ్

స్వేచ్ఛాయుత ఎన్నికల కోసమే ఫ్లాగ్ మార్చ్

 

మెట్ పల్లి డిఎస్పి రాములు

 

*ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని మెట్ పల్లి డిఎస్పి రాములు అన్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి ఆదివారం పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మెట్ పల్లి డిఎస్పి రాములు మాట్లాడుతూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్చాయుతగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ రాములు హెచ్చరించారు. ప్రజలంతా ఎలక్షన్ సమయంలో పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో సి.ఐ అనిల్ కుమార్, ,ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


  1. .
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )