
దుండగుల తీరుతో దగ్ధమైన ఈత వనం..
దుండగుల తీరుతో దగ్ధమైన ఈత వనం..
– ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై కిరణ్ కుమార్
మెట్ పల్లి;(కోరుట్ల) ప్రతినిధి, మే 26 (ప్రజాకలం) : మండలంలోని వెంపేట్ గ్రామంలోని (అన్నపూర్) ఈత వనాన్ని కొంతమంది దుండగులు కుట్రపూరితంగా 22-05-2026 రాత్రి సమయంలో తగలబెట్టిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనను 23-05-2026న గమనించిన కల్లుగీత కార్మికులు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి అనుమానితులపై ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న ఎస్సై కిరణ్ కుమార్ 26-05-2026న సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత కల్లుగీత కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
TAGS Hot News

