రామగిరి కోట అభివృద్ధిపై ఎంపీ వంశీకృష్ణ గళం

రామగిరి కోట అభివృద్ధిపై ఎంపీ వంశీకృష్ణ గళం

రామగిరి కోట అభివృద్ధిపై ఎంపీ వంశీకృష్ణ గళం

-పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పార్లమెంట్‌లో విన్నపం

-ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవపై సర్వత్రా హర్షం

పెద్దపల్లి,మార్చి 25:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు, చారిత్రక నేపథ్యం కలిగిన రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ గడ్డం వంశీకృష్ణపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.బుధవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓదెల మండలం మడక మాజీ ఎంపీటీసీ ఆవుల ముత్తయ్య, కరుణ సేవా సంస్థ వ్యవస్థాపకులు బచ్చల్లి రాజయ్య పాల్గొని ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగిరి కోట కేవలం ఒక కట్టడం మాత్రమే కాదని,అది మన పూర్వీకుల శౌర్యానికి,శిల్పకళా వైభవానికి నిలువుటద్దమని పేర్కొన్నారు.కోట పరిధిలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ,ఇక్కడ లభించే అరుదైన ఔషధ మొక్కలు ఆయుర్వేద రంగానికి ఎంతో కీలకమని వివరించారు.విశాలమైన ప్రాంగణం,ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మార్చాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరా గావ్ -మేరీ ధరోహర్ పథకం కింద రామగిరి కోటను చేర్చి ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.గత ఫిబ్రవరి నెలలో కరుణా సేవా సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలిసి కోట అభివృద్ధిపై వినతిపత్రం సమర్పించిన విషయాన్ని వారు గుర్తు చేస్తూ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేసి రామగిరి ఖిల్లాను ప్రపంచ పర్యాటక పటంలో నిలపాలని కోరారు.ఎంపీ వంశీకృష్ణ దీనిపై పార్లమెంట్‌లో మాట్లాడటం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఆశాజనకంగా ఉందని,ఎంపీ చొరవతో రాబోయే రోజుల్లో రామగిరి కోట రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి వీరరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోసిక రాజేశం తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో రాబోయే రోజుల్లో రామగిరి కోట రూపురేఖలు మారుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )