
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
జగిత్యాల ప్రతినిధి జూన్ 12 (ప్రజా కలం)
జగిత్యాల పట్టణంలోని మోచి బజార్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గంగాధర్ అనే టేలర్ కు చెందిన ఇంట్లో నిల్వ ఉంచిన దాదాపు 60 కొత్త కుట్టు మిషన్లు కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు 8 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుని ద్వారా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే జగిత్యాల ఫైర్ స్టేషన్ సిబ్బంది ఇంజన్ తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కాగా ప్రమాదానికి సంబంధించి విషయం తెలుసుకున్న జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి – శ్రీనివాస్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ తదితరులు ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించి బాధితునితో మాట్లాడారు.

TAGS Hot News

