
లింగ నిర్ధారణ పరీక్ష చేస్తున్న హయగ్రీవ హాస్పిటల్ సిబ్బందిపై కేసు
లింగ నిర్ధారణ పరీక్ష చేస్తున్న హయగ్రీవ హాస్పిటల్ సిబ్బందిపై కేసు
ముగ్గురిపై కేసు నమోదు …దర్యాప్తు
రంగారెడ్డి జిల్లా, వనస్థలిపురం, ప్రజా కలం, జూన్ 13:
వనస్థలిపురం పరిధిలో ఉన్న హయగ్రీవ హాస్పిటల్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని వనస్థలిపురం పోలీస్ సమచారం రాగా డికాయ్ ఆపరేషన్ ద్వారా హాస్పిటల్ కి ఓ మహిళ ను పంపి తనకు లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించాలని కోరగా హాస్పిటల్ డైరెక్టర్ అయిన కొర్ర రాజు, రిసెప్షన్నిస్ట్ గా పని చేస్తున్న లోకేష్ లు ఇద్దరు కలిసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తాం అని చెప్పి,వారికి తెలిసిన వ్యక్తి అయిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తుక్కుగూడ వద్ద ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న వ్యక్తి స్కాన్ చేసి పుట్ట బోయే బిడ్డ ఆడ, మగ అని చెపుతాడని అతనికి రిఫర్ చేశారు. పోలీసులు తుక్కుగూడ వద్ద శ్రీ సాయి ధనుష్ క్లినిక్ వద్ద ఉన్న ల్యాబ్ లో డికాయ్ ఆపరేషన్ చేసి అందులో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

