కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ..

కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ..

కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ..

చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూలై 21 (ప్రజా కలం) కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. కోరుట్ల బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును దుండగుడు ఎత్తుకెళ్లి నిజామాబాద్ వైపు తీసుకెళ్లినట్లు సమాచారం.
బస్సు కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కోరుట్ల, మెట్‌పల్లి పోలీసులు సంయుక్తంగా బస్సును వెంబడించారు. ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ దేవాలయం సమీపంలో బస్సును గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి వివరాలు, చోరీకి గల కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )