
బీహార్ కు చెందిన వ్యక్తి గంజాయి అమ్ముతుండ గా పట్టుకున్న పోలీసులు
బీహార్ కు చెందిన వ్యక్తి గంజాయి అమ్ముతుండ గా పట్టుకున్న పోలీసులు
–కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్…
ఇబ్రహీంపట్నం ఆగస్టు : 23 ( ప్రజా కలం ప్రతినిధి )
జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్పల్లి డిఎస్పి రాములు సూచనల మేరకు మెట్పల్లి సీఐ సురేష్ బాబు ఆధ్వర్యం లో ఇబ్రహీం పట్నం ఎస్సై జి నవీన్ కుమార్ పోలీస్ సిబ్బంది తో కలిసి టీంను ఫామ్ చేసి గంజాయి అమ్ముతున్న వారిని పట్టుకునే ప్రయత్నం లో తేదీ 23.08.2026 రోజున బీహార్ రాష్ట్రానికి చెందిన సాగర్ కుమార్ తండ్రి కమల్ కిషోర్ బహార్దార్,వయస్సు19 సంవత్సరాలు అను వ్యక్తి ఇబ్రహీంపట్నం వైపు గంజాయి అమ్ముటకు వస్తున్నాడు అనే నమ్మదగిన సమాచారం మేరకు ఆ వ్యక్తి కోసం కాపు కాస్తుండగ మెట్పల్లి నుండి ఆర్టీసీ బస్సు లో ఇబ్రహీం పట్నం వచ్చిన నిందితుడు సాగర్ కుమార్ ని ఇబ్రహీం పట్నం బస్టాండ్ లో పట్టు కొని అతని విచారించగా అతను నాలుగు నెలలుగా మెట్పల్లి పట్టణంలో ఒక రూమ్ అద్దెకి తీసుకొని అతని తండ్రి, అతని స్నేహితుడి తో కలిసి ఉంటూ రోజువారిగా హమాలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. బీహార్ నుంచి గంజాయిని తీసు కొచ్చి గత కొంతకాలంగా మెట్పల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో గల వ్యక్తులకు అమ్ముతున్నాడు అనీ, అదే క్రమంలో పది రోజుల క్రితం బీహార్ కి వెళ్లి ఒక కిలో గంజాయిని తీసుకొచ్చి మెట్పల్లి పరిసర ప్రాంతాల్లో అమ్మగా మిగిలిన 300 గ్రాముల గంజాయిని ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల్లో అవ సరం ఉన్న వ్యక్తులకు అమ్ముదామని మెట్పల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కి ఇబ్రహీం పట్నం బస్టాండ్ లో ప్రభుత్వ నిషేధిత గంజాయి తో దిగినానని ఒప్పుకోగా అతని అదుపులోకి తీసుకొని అతని వద్ద గల 300 గ్రాముల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్ లను సీజ్ చేసి అతని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనది. ఇట్టి ఆపరేషన్ లో ఇబ్రహీం పట్నం ఎస్సై జి నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది సంతోష్ కుమార్, ప్రశాంత్ చైతన్య, మహేందర్ లో చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారని మెట్పల్లి సీఐ బి సురేష్ బాబు ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్. కానిస్టేబుల్ సంతోష్ కుమార్, ప్రశాంత్ చైతన్య, మహేందర్ లను అభినందించినారు. ఇకపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో యువత ప్రభుత్వాన్ని నిషేధిత గంజాయిని సరఫరా చేసిన లేదా గంజాయి తాగు తున్నట్లుగా సమాచారం వచ్చిన అట్టి వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని మెట్పల్లి సిఐ బి.సురేష్ బాబు ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్ హెచ్చరించినారు.

