
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లతో ఏరువాక..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లతో ఏరువాక..
*వెల్గటూర్ మండలంలో 4,250 ఎకరాలలో వరి
*ప్రాజెక్టు నీళ్లతో మూడు పంటల సాగు
*వ్యవసాయ పనులల్లో బిజీ, బిజీగా రైతులు

వెల్గటూర్, జులై 27, ప్రజాకలం ప్రతినిధి :
ఒక్కప్పుడు అక్కడి భూములన్నీ ఏ రకమైన పంటలు పండకుండ బీడు భూములుగా నెర్రలు బారీ ఉండేవి. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు పుణ్యమని గోదావరి పరివాహక ప్రాతాలల్లో మూడు కాలాలల్లో పంటలు పడుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి నది పై ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించ తలపెట్టగా, తెలంగాణ ప్రభుత్వం దాని నిర్మాణాన్ని పూర్తి చేసింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లతో వెల్గటూర్ మండలంలోని చెగ్యాం, ముత్తునూర్, మొక్కట్రావుపేట, కోటిలింగాల గ్రామాలతో పాటుగా మండలంలోని పలు గ్రామాలలో పంటలు పండి, అక్కడి రైతులకు సిరులు కురుస్తున్నాయి. ఇక్కడి రైతులు వర్షం పడిన, పడకున్న ఎప్పుడు వ్యవసాయ పనులల్లో నిమగ్నమై ఉంటున్నారు .
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వారి పొలాల వరకు పైప్ లైన్ ద్వారా నీటిని తరలిస్తూ కాలాలతో పని లేకుండా వరిని సాగు చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక వెల్గటూర్ మండలంలో ఎక్కడ కూడా వరి సాగు జరగడం లేదు. మండలంలోని జగదేవ్ పేట గ్రామంలో గల జంగల్ నాల ప్రాజెక్టు కింద కొంత మరియు ఎల్లంపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలల్లో మాత్రమే వరి పంటల సాగు జోరుగా జరుగుతుంది.
వెల్గటూర్ మండలంలోని చెగ్యాం లో 1080, ముత్తునూర్ లో 1100, రాంనూర్ లో 810, మొక్కట్రావుపేటలో 160 ఎకరాలతో పాటుగా, వెల్గటూర్ గ్రామ పరి పరవాహక ప్రాంతాలల్లో 1100 ఎకరాలల్లో వరి పంట సాగు పండుగలా సాగుతుంది. నిత్యం అక్కడి రైతులు వ్యవసాయ పనులల్లో నిమగ్నమై పోతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో వరి నాటు దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాలలో నాట్లు పూర్తి అయ్యాయి..


