ఆదర్శంగా నిలిచిన సర్పంచ్..

ఆదర్శంగా నిలిచిన సర్పంచ్..

ఆదర్శంగా నిలిచిన సర్పంచ్..

తానే ట్రాక్టర్ నడిపి చెత్త తరలింపు

మెట్‌పల్లి ప్రతినిధి నవంబర్ 5 (ప్రజా కలం)గ్రామ పరిశుభ్రత విషయంలో ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మెట్‌పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి గ్రామంలో పంచాయతీ చెత్త ట్రాక్టర్ డ్రైవర్ అనారోగ్యానికి గురై కొద్దిరోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో చెత్త పేరుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ కడారి రాజేష్ సమస్య పరిష్కారం కోసం ఎదురుచూడకుండా తానే స్వయంగా రంగంలోకి దిగారు. ట్రాక్టర్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని సిబ్బందితో కలిసి గ్రామంలోని వీధుల్లో పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. గ్రామ పరిశుభ్రత కోసం హోదాను పక్కనపెట్టి స్వయంగా శ్రమించిన సర్పంచ్ కడారి రాజేష్ చొరవను గ్రామస్థులు అభినందించారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా అవసరమైన సమయంలో స్వయంగా ముందుకు రావాలనే సందేశాన్ని చాటిచెప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )