భూభారతితో సమస్యలు పరిష్కారం

భూభారతితో సమస్యలు పరిష్కారం

*భూభారతితో సమస్యలు పరిష్కారం*
* జిల్లా కలెక్టర్ హనుమంతరావు
*వలిగొండ జూన్ 4 ప్రజాకలం*:భూభారతితో భూ సమస్యలు తర్వితగతిన పరిష్కారమవుతాయని,జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.మండల పరిధిలోని నాగారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ప్రతీ ఒక్కరికి తమ భూమిపై హక్కు చట్టబద్ధంగా,స్పష్టంగా ఉండేలా భూభారతి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా స్థానికుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ప్రజలు భూరికార్డులపై పూర్తి సమాచారం కలిగి ఉండటం ద్వారా భవిష్యత్తులో సమస్యలకు తావు లేకుండా ఉంటుందని సూచించారు. అలాగే గ్రామస్తులతో మాట్లాడుతూ భూభారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం గ్రామాల్లో సద స్సులు నిర్వహించి భూ సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేలా కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ,రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )