*దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది*

*దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది*

*దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది*

 

-ప్రభుత్వ విప్,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

 

-​అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌కు రూ. 5 కోట్లు,

 

-​జనవరి చివరిలో నాలెడ్జ్ సెంటర్‌కు శంకుస్థాపన

 

-ఘనంగా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ

 

పెద్దపల్లి,నవంబర్ 22:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)

దళితుల సంక్షేమం,అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారికి రావాల్సిన హక్కులు,సంక్షేమ పథకాలను ఈ ప్రాంతానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు.ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్‌లో స్వర్ణోత్సవ మహాసభను స్వర్ణోత్సవ కమిటీ ఛైర్మన్,సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, స్వర్ణోత్సవ కమిటీ కన్వీనర్ మైస రాజేష్, వైస్ ఛైర్మన్ లంక సదయ్య,సమన్వయకర్త కుక్క అశోక్,కో-కన్వీనర్ పొనుగంటి రాజనర్సు,సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొంకూరి మధు,అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్,పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి,టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకురి శంకర్,జిల్లా బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి సిపిఐ నేత తాండ్ర సదానందం హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న చిరకాల డిమాండ్‌ను త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే,జనవరి చివరి నాటికి రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలెడ్జ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.ప్రతిపాదిత స్థలంపై ఏదైనా కోర్టు వివాదం ఉన్నట్లయితే,ఇప్పటికే ఆర్డీఓ,కలెక్టర్లకు సమాచారం సేకరించాలని సూచించామని,అవసరమైతే ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసి మంత్రులు శ్రీధర్ బాబు,లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహ కూడళ్ల అభివృద్ధిపై మాట్లాడుతూ,ఇప్పటికే బస్టాండ్,డిపో వైపులా రోడ్డు వెడల్పు పనులు చేపట్టామని పేర్కొన్నారు. మంచిర్యాలలోని పాత పార్లమెంట్ భవనం ఆకృతిలో ఉన్న ఐలాండ్ తరహాలో పెద్దపల్లి,సుల్తానాబాద్ అంబేద్కర్ విగ్రహ కూడళ్లను ఆధునీకరిస్తామని చెప్పారు.ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి లోపు సుల్తానాబాద్‌లో కాంస్య విగ్రహం,సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేస్తామని,పెద్దపల్లి కూడలి డిజైన్‌పై 15-20 రోజుల్లో నిర్ణయం తీసుకుని చెబితే రూ.50 లక్షలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.సుమారు 30 ఏళ్ల క్రితం తాను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన సమయంలో ఒక ఎస్సీ,ఎస్టీ కేసు విషయంలో మామిడిపల్లి బాపయ్య చూపిన చొరవను, ఆయన నిబద్ధతను ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఈ ప్రాంతంలో బాపయ్య వంటి గొప్ప వ్యక్తి ఉండటం గర్వకారణమని కొనియాడుతూ, 50 ఏళ్ల వేడుకలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

 

*బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడతా:ఎంపీ వంశీకృష్ణ*

 

దేశ జనాభాలో 25 నుంచి 30 శాతం ఉన్న ఎస్సీ,ఎస్టీ వర్గాలకు బడ్జెట్‌లో కేవలం 2 శాతం నిధులు మాత్రమే కేటాయించడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.జనాభా దామాషా ప్రకారం 25-30 శాతం నిధులు కేటాయించాలని ఆయన పార్లమెంట్‌లో డిమాండ్ డిమాండ్ చేస్తామన్నారు.దళితుల మధ్య గొడవలు సృష్టిస్తూ ఐక్యతను దెబ్బతీసే శక్తులను గుర్తించాలని,దళితులంతా ఐక్యమత్యంతో రాజకీయంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఇకపై సహించబోమని, రాజ్యాంగాన్ని మార్చే కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను ఎంపీగా ఉన్నప్పటికీ ఇప్పటికీ వివక్షకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన వంశీకృష్ణ,ఎంతమంది వ్యతిరేకించినా కాకా వెంకటస్వామి,వివేక్ వెంకటస్వామి చూపిన బాటలో అందరినీ కలుపుకుంటూ బడుగు, బలహీన వర్గాల సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతానని స్పష్టం చేశారు.అనంతరం ముఖ్య అతిథులకు నిర్వహకులు శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటో లను అందజేశారుఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవ్వంపల్లి సతీష్,రాష్ట్ర కార్యదర్శి పాల రాజేశం,జిల్లా నాయకులు గుట్ట లింగయ్య,ఆరెల్లి మల్లేష్,చొప్పదండి మల్లేశం,సంకెనపల్లి లక్ష్మయ్య,నక్క శంకరయ్య,బొల్లి నందయ్య,భూపెల్లి మల్లేశం,బాదె వెంకటేష్,బూడిద సమ్మయ్య, చుంచు మల్లేష్,కాసిపేట పోచయ్య,పెరక బానేష్,బోసెల్లి నారాయణ,కాంపల్లి నరసయ్య,గొట్టే రాజయ్య,కన్నూరి బాబు తోపాటు పెద్ద సంఖ్యలో మేధావులు, విద్యావంతులు,యువకులు,దళిత సంఘాల నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )