
కొరుట్ల లాడ్జిలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
కొరుట్ల లాడ్జిలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు పత్రాల పరిశీలన.. నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక
మెట్ పల్లి :(కొరుట్ల) ప్రతినిధి, నవంబర్ 22( ప్రజా కలం ):
కొరుట్ల పట్టణంలోని వివిధ లాడ్జిలలో పోలీసులు శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొరుట్ల సీఐ కొమ్ము తిరుపతి, ఎస్ఐ జి. శ్యాం రాజ్ పోలీసు సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జిల్లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని లాడ్జి నిర్వాహకులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు బస చేసినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. లాడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వేదికగా మారనివ్వకూడదని నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారితో పాటు వారికి సహకరించే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

