
స్థానికం’పై సర్వత్రా ఆసక్తి.
*స్థానికం’పై సర్వత్రా ఆసక్తి..
* ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావహులు..
*వలిగొండ జూన్ 17 ప్రజాకలం*: స్థానిక సమరానికి సంబంధించి ఈనె లాఖరు లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ప్రకటించడంపై ఆశావహులు అప్రమత్తం అవుతున్నారు.ఏడాదిగా ఇలాంటి ప్రకటనలు వస్తున్న ప్పటికీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇవ్వడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానిక సమరంపై రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుండడంతో ఎలాగైనా షెడ్యూల్ రానుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.అయితే తొలుత పంచాయతీ ఎన్నికలా…లేక పరిషత్ ఎన్నికలా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.తొలుత పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి నప్పటికీ ప్రభుత్వం పరిషత్ ఎన్నికలపైనే దృష్టి సా రిస్తుండడంతో కొంతమంది ఆశావహుల్లో అందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎన్నికలు ఏవైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.ప్రకటన విడుదలైతే జిల్లాలో రాజకీయ వేడి షురూ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది….