అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

ఆత్మకూర్ వాగులో మెరుపు దాడులు.. మూడు ట్రాక్టర్లు పట్టివేత

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక

 

 

మెట్‌ పల్లి రూరల్ ,నవంబర్ 24,(ప్రజా కాలం):మండలంలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు మెట్‌పల్లి పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆత్మకూర్ గ్రామ శివారులోని వాగు నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వాగు పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మెరుపు దాడులు నిర్వహించారు. ఆత్మకూర్ వాగు నుంచి కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వర్, కానిస్టబెల్లు మల్లేష్ ,శ్రీనివాస్,కృష్ణంరాజు రంగంలోకి దిగారు.వాగు పరిసర ప్రాంతాల్లో మాటు వేసి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లను గుర్తించారు. ఈ క్రమంలో TS 21 B 2055, TS 21 E 3315, TS 21 M 0131 నంబర్లు గల మూడు ట్రాక్టర్లను అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం పట్టుబడిన మూడు ట్రాక్టర్లను మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి, సంబంధిత వాహన యజమానులపై కేసులు నమోదు చేశారు.తదుపరి చట్టపరమైన చర్యలు, జరిమానాల విధింపు నిమిత్తం మూడు ట్రాక్టర్లను మెట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయ అధికారులకు అప్పగించారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం చట్టరీత్యా నేరమని, సహజ వనరులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఆత్మకూర్ వాగులో మూడు ట్రాక్టర్ల పట్టివేతతో అక్రమ ఇసుక రవాణాదారుల్లో కలకలం నెలకొంది. ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిఘా పెంచి అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )