అమాయకులను అరిగోస పెడుతున్న బండారి యాదగిరి, సుభాష్ నాయక్

అమాయకులను అరిగోస పెడుతున్న బండారి యాదగిరి, సుభాష్ నాయక్

అమాయకులను అరిగోస పెడుతున్న బండారి యాదగిరి, సుభాష్ నాయక్
నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు లాక్కుని వ్యాపారం
ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా
ముఠా నాయకుడు మాజీ మేయర్ అమర్ సింగ్ అండదండలు
రాజకీయంగా నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నాపై కక్ష సాధింపు..
భాదితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు
కబ్జాకోరు బండారు యాదగిరి,
మాజీ కార్పోరేటర్ సుభాష్ పై వెంటనే చర్యలు చేపట్టాలి..
కాంగ్రెస్ నాయకురాలు శ్రీలత భద్రునాయక్ ఫైర్
మేడిపల్లి జూన్ 24(ప్రజాకలం న్యూస్)
మేడిపల్లి బాపూజీనగర్ లో నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలను అక్రమంగా గుంజుకుని హరిగోస పెడుతున్న భూ కబ్జాకోరు బండారు యాదగిరి,
మాజీ కార్పోరేటర్ సుభాష్ నాయక్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకొని భాదితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీలత భద్రునాయక్ డిమాండ్ చేశారు.ఈ మేరకు మేడిపల్లి లోని వారి నివాసంలో మంగళవారం భాదితులతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన భాదితులకు జరిగిన అన్యాయం కోసం స్థానిక ఎమ్మార్వో,ఆర్డీఓ, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గరికెళ్ళి బాధితుల తరఫున ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.దాంతో బాధితులకు న్యాయం చేస్తానని జాతీయ ఎస్టి కమిషన్ హామీ ఇవ్వడం జరిగింది.దీనిలో భాగంగా మే 15వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ ని,రాచకొండ కమిషనర్ జాతీయ ఎస్టీ కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది.దీంతో హైద్రాబాద్ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో జరిగిన
విచారణలో జాతీయ ఎస్టీ కమిషన్ ముందు మేడ్చల్ జిల్లా కలెక్టర్,పోలీస్ శాఖ వారు హాజరై తమ వివరణ ఇవ్వడం జరిగింది.విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని కమిషన్ ముందు వివరణ కూడా ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వo ఇచ్చిన ఇంటి పట్టాలను కొంత మంది కబ్జాదారులు,రాజకీయ నాయకులు గుంజుకున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించి మొత్తం 86 పట్టాలలో దాదాపు 75 పట్టాలను బండారి యాదగిరి, మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్ ముఠాగా ఏర్పడి అమాయక ప్రజలనుండి బలవంతంగా గుంజుకోవడం, గెస్ట్ హౌస్ కట్టుకోవడం,ఎవరు రాకుండా సిసీ కెమెరాలు అమర్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రెవెన్యూ శాఖ వారు వెంటనే నిరుపేదల నుండి గుంజుకున్న 75 పట్టాలను వెంటనే స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మేడిపల్లి ఎమ్మార్వోపై సమగ్ర విచారణ జరిపించి 30 రోజుల లోపు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
బాధితులకు రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
తనను బాధితుల తరపున కోట్లాడకుండా ఉండడానికి భయ బ్రాంతులకు గురి చేశారని అయినప్పటికీ భయపడకపోవడంతో, అందరి ముందే నాపై దాడికి ప్రయత్నం చేశారని వాపోయారు.నేను ఢిల్లీ వెళ్లి జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో మాజీ మేయర్ అమర్ సింగ్ ముఠా సభ్యుల కబ్జాలు బయటపడతాయనే భయంతో పీర్జాదిగూడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న నన్ను అకారణంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతరావుని తప్పుదోవ పట్టించి ఎటువంటి నోటీసు, వివరణ లేకుండా నన్ను మహిళ అధ్యక్షరాలు పదవి నుండి ఆకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మధ్యనే బిఆర్ఎస్ నుండి వచ్చిన ఆంధ్రకు చెందిన మహిళకు అధ్యక్షురాలు పదవి మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్ వారి ముఠా సభ్యులు ఇప్పించి, నన్ను మానసికంగా వేధించే ప్రయత్నం చేశారని అన్నారు.కానీ నేను భయపడలేదు! ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయ సమస్యలను
ఎదురుకోవడానికి ప్రత్యర్థుల పన్నాగాన్ని, కుట్రలను ఎదుర్కోవడానికి
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని, ఉద్యమాల గడ్డ తుంగతుర్తి బిడ్డగా,కాకతీయనగర్ మహిళగా టిఆర్ఎస్ పార్టీ నుండి కొత్తగా వచ్చిన మాజీ మేయర్ అమర్ సింగ్ ముఠా సభ్యుల ఆగడాలను తరిమి కొడతానని,వారి ముఠా సభ్యుల దౌర్జన్యాలను, అక్రమాలను, వసూళ్లను అడ్డుకుంటున్నాననే భయంతో రాజకీయంగా నా ఉన్నతిని తట్టుకోలేక మరోసారి నాపై దాడి చేసే అవకాశం కూడా ఉందని అన్నారు.అయినా భయపడను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తే కచ్చితంగా అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాధితులు ఆంగోత్ బద్రి, మూడు పద్మ, గుగులోతు వసంత, గూగులోత్ సౌందర్య, పత్తి భాయి, బంజారా నాయకులు గూగులోత్ శ్రీనివాస నాయక్ పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )