
నెంబర్ ప్లేట్ లేనివాహనాలు…
పట్టించుకోని ట్రాన్స్పోర్ట్ అధికారులు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 28(ప్రజా కలం) అధికారుల అలసత్వం కారణంగా రోడ్డుపైన నెంబర్ ప్లేట్ లేని టాక్టర్లు, వాహనాలు దర్జాగా తిరుగుతున్నాయి. అక్రమ రవాణాకు అక్రమార్కులు ఉపయోగిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనీ ప్రజలు వాపోతున్నారు. మండలంలోని వెల్లుల్ల గ్రామంలో నంబర్ ప్లేట్ లేనిఇసుక ట్రాక్టర్ అతి వేగంగా రావడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. తహసీల్దార్ కి మూడు సార్లు వెల్లుల్ల గ్రామస్తులు విన్నవించినరని గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మెయిన్ రోడ్డును అనుకోని ఉంది,నంబర్ ప్లేట్ లేని ఇసుక ట్రాక్టర్ లు ఓవర్ లోడుతో అతి వేగంగా నడుపుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మూడు సార్లు విన్నవించగా సంబంధిత శాఖ అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు, చిన్న పిల్లలు స్కూల్ కు వచ్చే టైమ్ లో తిరిగి ఇంటికి వెళ్ళే టైమ్ లో అయినా ఆ ఇసుక ట్రాక్టర్ లను నిలిపివేయాలని ట్రాక్టర్ డ్రైవర్ లకు చెప్పండి సార్.. అని వెల్లుల్ల గ్రామస్తులు మండలాధికారిని వేడుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుది. శనివారం రోజు ఉదయం పిల్లలు స్కూలుకు వస్తు రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వస్తున్న నంబర్ లేని ఇసుక ట్రాక్టర్ ఓవర్ లోడు ఉండడంతో బ్రేకులు రాకపోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి..లేదంటే పదుల్లో పిల్లలు ఆ ట్రాక్టర్ కింద పడిపోయి ఉండేవాళ్ళు.. దయచేసి ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయిలో స్పందించండి.. అని గ్రామస్తులు మండల ప్రజలు వేడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక యువకుడు ఇసుక ట్రాక్టర్ కిందపడి మరణించడం జరిగింది అయినా అధికారులు స్పందించలేదు.. ఇకనైనా అధికారులు స్పందించి నంబరు ప్లేట్లు లేని ఇసుక ట్రాక్టర్ లపై చర్యలు తీసుకుంటారో లేదొ వేచి చూడాల్సిందే..



