
గల్ఫ్ కార్మిక ఉద్యమ నాయకుని పై దాడి హేయమైన చర్య
మెట్ పల్లి :(కోరుట్ల) ప్రతినిధి జులై 17 (ప్రజా కలం)గల్ఫ్ కార్మికుల ఉద్యమ నాయకుడు ఎన్ ఆర్ ఐ అడ్వైజరి కమిటీ మెంబర్ నంగి దేవేందర్ రెడ్డి పై బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేయడం దారుణమైన విషయం అని మాజీ నిజామాబాద్ పార్లమెంట్ కో – ఆర్డినేటర్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో 18 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా వచ్చిందని, చెప్పి వేల్పూరు గ్రామంలో చౌరస్తా దగ్గర మృతుల గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులను తీసుకొనివస్తామని, సవాల్ విసురుతున్నానని ప్రశాంత్ రెడ్డి కు చెప్పడంతో వారు, వారి అనుచరులు గుంపుగా వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో దాడి చేయించడం అసభ్య పదజాలంతో దూషించడం అనేది చాలా దారుణమైన విషయం అని అన్నాను. ఇలాంటి దాడులు చేయడం మానుకోవాలని, దాడి చేసిన వారిని గుర్తించి వారందరిపై ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారులను కోరారు.

