
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నిందితుని అరెస్ట్
106 దొంగ సర్టిఫికెట్ లు,1 కంప్యూటర్, 1 ప్రింటర్ ,1 లామినేషన్ మెషిన్ స్వాదినం.
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 23 (ప్రజా కలం) నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న రుద్రవీణ గోపాల్ ను అరెస్టు చేసినట్లు కోరుట్ల పోలీసులు తెలిపారు వారు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రోజు కోరుట్ల పట్టణానికి చెందిన రుద్ర వేణుగోపాల్ తండ్రి వెంకటేష్ వయసు 45 సంవత్సరాలు, కులం పద్మశాలి, నివాసం ఆదర్శనగర్, కోరుట్ల , అనునతను పోచమ్మ వాడ లో మంత్ర ఆన్లైన్ సెంటర్ నడిపిస్తూ గత రెండు సంవత్సరాల నుండి ఫోటోషాప్ ద్వారా దొంగ సర్టిఫికెట్లు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మెమోలు మరియు నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ అవసరం ఉన్నవారికి వాటిని అమ్ముతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం రోజు కోరుట్ల పోలీసులు మరియు సి సి ఎస్ పోలీస్ వారు జాయింట్ గా నిందితుడి షాప్, మంత్ర ఆన్లైన్ సెంటర్ పైనా ఆకస్మిక దాడి చేసి నిందితుడు వేణుగోపాల్ నీ పట్టుకొని అతని వద్ద నుండి 106 నకిలీ సర్టిఫికెట్లు (పదవ, ఇంటర్, డిగ్రీ, పీజీ, బి టెక్ ఎక్స్పీరియన్స్, బర్త్, డెత్ సర్టిఫికెట్)ఒక కంప్యూటర్ ఒక ప్రింటర్ పేపర్ కటింగ్ మిషన్ లామినేషన్ మిషన్ ఒక మానిటర్ స్వాధీన పరుచుకుని , అతని మీద కేసు నమోదుచేసి,నిందితున్ని రిమాండ్ కి తరలించనైనది. నకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్న నిందితుని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీ.ఐ కోరుట్ల సురేష్ బాబు, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ ఏం. శ్రీనివాస్ , ఎస్సై కోరుట్ల చిరంజీవి , ఎస్సై సి సి ఎస్ కె. రాజు, కానిస్టేబుల్ లు అఫ్రోజ్ , సాజిద్ , వినోద్, సురేష్, కమలాకర్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.

