ఈ నెల 7న పెద్దపల్లికి మాజీ మంత్రి హరీష్ రావు

ఈ నెల 7న పెద్దపల్లికి మాజీ మంత్రి హరీష్ రావు

 

-నియోజకవర్గ స్థాయి సమావేశానికి తరలిరావాలని దాసరి మనోహర్ రెడ్డి పిలుపు.

పెద్దపల్లి,జూన్ 05:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా,భవిష్యత్ కార్యాచరణ మరియు ప్రజా సమస్యలపై పోరాట వ్యూహాలను ఖరారు చేసేందుకు ఈ నెల 7న నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి మెయిన్ రోడ్డులో గల తిరుమల గార్డెన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్,మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు హాజరై,పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి,ప్రజా పక్షాన నిలబడి పోరాడటానికి ఈ సమావేశం ఒక దిక్సూచిలా మారబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు,నియోజకవర్గంలోని ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు,అన్ని మండలాల మరియు పట్టణాల కార్యవర్గ సభ్యులు,ముఖ్య నాయకులు,క్రియాశీలక కార్యకర్తలు,పార్టీ అభిమానులు,ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి, భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )