
దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తల అరెస్ట్ – రిమాండ్
దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తల అరెస్ట్ – రిమాండ్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 4 (ప్రజా కలం) మెట్ పల్లి సర్కిల్ పరిధిలోనీ మెట్ పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లోనీ టెంపుల్ లలో వరుస దొంగతనాలు జరుగుతుండగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి డిఎస్పి రాములు ఆధ్వర్యంలో మెట్ పల్లి సిఐ బి సురేష్ బాబు నేతృత్వంలో మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్,మల్లాపూర్ ఎస్సై అనిల్,ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్, ఐడి పార్టీ కానిస్టేబుల్ విశాల్,కిరణ్, ప్రణయ్ లతో కలిసి గాలిస్తుండగా సిసి ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించి వారి కోసం గాలిస్తుండగా దొంగలు వెల్లుల్ల గ్రామానికి చెందిన ఆరే శంకర్, అతని భార్య ఆరే అనూష మరి కొందరు కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్, వర్షకొండ తిమ్మాపూర్ వేముల కుర్తి గ్రామాల్లోని పలు ఆలయాలల్లో, మెట్ పల్లి మండలం ఆత్మకూరులో వేంపేట్, మల్లాపూర్ మండలంలోని సిర్పూర్ రాఘవపేట్ లోని పలు ఆలయాలలో కథలాపూర్ మండలంలోని ఊట్పల్లి గ్రామంలో మొత్తంగా 8 కేసులలో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.

గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకొని విచారించగా ఎనిమిది కేసులలో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు తెలిపారు.వారి వద్ద నుండి వారి దొంగతనం చేసిన దొంగ సొత్తు 20 గ్రాముల బంగారం,1.250 కేజీల వెండిని స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు వెల్లడించారు.

