
సూపర్వైజర్ ఆరా తీస్తేనే కదలిక..?
సూపర్వైజర్ ఆరా తీస్తేనే కదలిక..?
– 11 దాటిన తెరుచుకొని అంగన్వాడి కేంద్రం
మల్లాపూర్, అక్టోబర్ 26 (ప్రజాకలం ప్రతినిధి):
చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య అందించాల్సిన అంగన్వాడీ కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించిందనే విమర్శలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం గా మారింది. మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2 సోమవారం సూపర్వైజర్ ఫోన్ చేసే వరకు తెరుచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంగన్వాడి కేంద్రం ముసి ఉంది అని ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి కి సమాచారం తెలియడంతో సదరు అంగన్వాడీ టీచర్ కు ఫోన్ చేసి ఆరా తీస్తే అంగన్వాడీ టీచర్ భోజనానికి వెళ్లినట్లు సమాధానమిచ్చినట్లు సమాచారం. అయితే సూపర్వైజర్ ఫోన్ చేస్తేనే అంగన్వాడి సెంటర్ ను ఓపెన్ చేశారని లేదంటే చేసే వారు కాదని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే చిన్నారులు లేకుండా అంగన్వాడి కేంద్రాన్ని తెరిచి సూపర్వైజర్ కు సమాచారం ఇచ్చినట్టు స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చిన్నారులకు సేవలందించాల్సిన అంగన్వాడి కేంద్రం ఇలా మూసి ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సదరు అంగన్వాడీ కేంద్రం నిర్వహణపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

