నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

 

 

మెట్‌పల్లి పరిధిలో 5 గ్రామాల్లో 35 సీసీ కెమెరాల ఏర్పాటు

 

– పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం

 

 

మెట్‌పల్లి:( కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 16 (ప్రజా కలం)నేరాల నియంత్రణ, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు అత్యంత కీలకమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐదు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలను పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలు, కాలనీలు, ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, వ్యాపార సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నేరస్థులను త్వరగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. చోరీలు, రోడ్డు ప్రమాదాలు, గొడవలు, ఇతర నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాల ఫుటేజీ కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ఇల్లు, దుకాణం, వ్యాపార సంస్థ, అపార్ట్‌మెంట్ తదితర ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జగ్గసాగర్‌లో 10, మెట్ల చిట్టాపూర్‌లో 6, అరపేటలో 4, విటంపేటలో 9, బంతుపేటలో 6 చొప్పున మొత్తం 35 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో గ్రామాల్లో భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే డయల్‌-112 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములు, ఇన్‌స్పెక్టర్లు సురేష్‌బాబు, శ్రీనివాస్, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, రాజునాయక్, శ్రీనివాస్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )