
అర్హత లేని వైద్యుడితో సేవలు
– అర్హత లేని వైద్యుడితో సేవలు
– సూర్య హాస్పిటల్‌కు షోకాజ్
మెట్‌పల్లి;(కోరుట్ల) ప్రతినిధి (ప్రజా కలం) పట్టణంలోని సూర్య హాస్పిటల్‌లో అర్హత లేని వ్యక్తితో వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ముస్కు జైపాల్‌రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వైద్య సేవలు, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం ఆసుపత్రి నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అనర్హులతో వైద్యం చేయిస్తున్న ఆసుపత్రులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
TAGS Hot News

