నకిలీ కేబుల్ అమ్ముతున్న షాప్ ఓనర్ పై కేసు నమోదు

నకిలీ కేబుల్ అమ్ముతున్న షాప్ ఓనర్ పై కేసు నమోదు

నకిలీ వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు
మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజా కలం) నకిలీ వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం రోజున
మధ్యాహ్నం ఒంటి గంటల సమయములో నాగేశ్వరరావు అనే వ్యక్తి పట్టణంలో గల నవదుర్గ ఎలక్ట్రికల్ షాప్ లో నకిలీ వి గార్డ్ కేబుల్ అమ్ముతున్నారన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆ దుకాణంలోకి వెళ్లి తనిఖీ చేయగా ఓరీజినల్ హెడ్ వి గార్డ్ కంపెనీకి సంబంధించిన రెప్రజెంటేటివ్, నిజామాబాద్ రోడ్ మెట్ పల్లిలో గల నవదుర్గ ఎలక్ట్రికల్స్ షాప్ కి వెళ్లి వి గార్డ్ కేబుల్స్ ఆర్డర్ చేయగా షాపు ఓనర్ అతనికి విగార్డ్ కి సంబంధించిన నకిలీ కేబుల్ బెండెల్ ఇవ్వగా అవి అతను సరిచూసుకొని నకిలీవని గ్రహించి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇవ్వగా నవదుర్గ ఎలక్ట్రికల్స్ ఓనర్ పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, 37 వి గార్డ్ కేబుల్ లు విక్రయించగా వాటి విలువ ఒక లక్ష 17 వేల మూడు వందల ఆరవై రూపాయలు సీజ్ చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )