
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి.
తేమ శాతం కలిగిన తర్వాతే తూకానికి తరలించాలి
కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ బిఎస్ లత

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 06 (ప్రజా కలం) ప్రభుత్వం పంటకు మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2389 బి గ్రేడ్ రకానికి 2369 కల్పిస్తుందని రైతులు వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో విక్రయించి మద్దతు ధర పొందాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతా వెల్లడించారు. మెట్ పల్లి మండలం చెవుల మద్ది, రామారావు పల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో గురువారం అదనపు కలెక్టర్ బి.ఎస్ లత పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు ధాన్యాన్ని శుభ్రపరిచి తగిన తేమ శాతం కలిగిన తర్వాత మాత్రమే తూకానికి ఇవ్వాలన్నారు.అనంతరం కొనుగోలు కేంద్రంలో తూకపు యంత్రాలు తేమయంత్రాలు ప్యాడి క్లీనర్స్ టార్ఫలెన్లు సరిపోయినన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. కేంద్రంలో నిర్వాహకులు వివరాలు మద్దతు ధర టోల్ ఫ్రీ నెంబర్ వివరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు తమ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగానే రసీదులు జారీ చేయడంతో పాటు వారి బ్యాంకు వివరాలను సక్రమంగా నమోదు చేసి పంట రుసుము సకాలంలో రైతులు ఖాతాలో జమ అయ్యేలా చూడాలని అన్నారు. అన్ని రకాల రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. వరి కొనుగోలు ప్రక్రియలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నంబర్ 18004258187 ను సంప్రదించాలని తెలిపారు.ఈ పరిశీలనలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్, సంబంధిత అధికారులు ఉన్నారు.


