రైతులకు నష్టం వాటిల్లకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

రైతులకు నష్టం వాటిల్లకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

రైతులకు నష్టం వాటిల్లకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన..

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి 9 (ప్రజా కలం) రైతులకు నష్టం వాటిల్లకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కలిసి సందర్శించారు. మార్కెట్ యార్డు మొత్తం మొక్కజొన్నతో నిండిపోవడంతో పాటు భారీగా వడ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు చేరుకున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం, మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మార్కెట్ యార్డులో టార్పాలిన్ల సౌకర్యం పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు…

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )